రాబర్ట్ స్యూయల్ విజయనగర చరిత్రను ప్రామాణికంగా నాటికి లభించిన ఆధారాలను బట్టి రచిస్తూ పోర్చుగీసు యాత్రికులు డోమింగో పెయిస్, ఫెర్నావో న్యూనిజ్‌ల కథనాలను ఇంగ్లీషులోకి అనువదించారు. విదేశ యాత్రికుల కథనాలనుండి సమాచారాన్ని సేకరించి నాటికి తెలియవచ్చిన శాసనాధారాలను పరిశీలించి రచించిన తొలి ప్రామాణిక విజయనగర చరిత్ర గ్రంథం ‘విస్మృత సామ్రాజ్యం – విజయనగరం’. క్రీ.శ. 1900 నాటి రాబర్ట్ స్యూయల్ రచనకు సరళమైన తెలుగు అనువాదం.