నేటి తెలుగు (స్వరూప సంగ్రహం)
ఒక భాషకు సంబంధించిన విశేషాలను కొన్ని పేజీలలోకి కుదించడం సాధ్యమయ్యేపని కాదు. భాషాంతర్గత విశేషాలు అతి గహనం. భాషావ్యవహార భేదాలు అనంతం. ఆధునిక తెలుగు భాషకు సంబంధించి పరిచయం చేయవలసిన వర్ణసమామ్నాయం గురించే స్పష్టత లేదు. ఇంకా ఏభయ్యారు వర్ణాలను గురించి మాట్లాడుతున్నవాళ్లే ఎక్కువ. తెలుగులో క్రియాస్వరూప భేదాలు, వాక్యనిర్మాణపులోతులు తెలియవలసినవి ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం చేయగలిగింది నేటి విద్యావంతుల లేఖనాది వ్యవహారాలలో సుమారుగా సమానంగా కనిపించే లక్షణాలను క్రోడీకరించి స్థూలంగా పరిచయం చేయడమే. క్త్వార్థకం, చేదర్థకం ఏవార్థకం వంటి సంస్కృత వ్యాకరణ పరిభాషలను బట్టి ఏర్పడ్డ పదాలను సాధ్యమైనంతవరకు పరిహరించాలని అనుకున్నా ప్రస్తుతానికది పూర్తిగా సాధ్యపడలేదు.
Title | నేటి తెలుగు |
Writer | డా. కె.కె.రంగనాథాచార్యులు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Available |
ISBN | -- |
Book Id | EBU008 |
Pages | 96 |
Release Date | 28-Feb-2021 |