1981 నుండి 2004 వరకు ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చరిత్ర బోధన చేశారు. ఆ తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయం చరిత్రశాఖలో అధ్యాపకులయ్యారు. ప్రాచీన, తొలిమధ్యయుగ శాసనాలు, సామాజిక ఆర్థిక చరిత్ర, మతసంస్థలు - పోషణ, పురాతత్త్వచరిత్ర, ప్రాచీన కట్టడాల ఆధునిక చరిత్ర విశ్లేషణ వంటి వైవిధ్యభరితమైన విభిన్న అంశాల పరిశోధన పట్ల ప్రొఫెసర్ సింగ్‌కు అపారమైన ఆసక్తి, నైపుణ్యం ఉన్నాయి. ఆమె సిద్ధాంత వ్యాసాలు వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆమె ఎన్నో గ్రంథాలను కూడా రచించారు. అవి: Kings, Braçhmanàas, and Temples in Orissa: An Epigraphic Study (AD 300-1147) (1994); Ancient Delhi (1999; 2nd edn., 2006); Mysteries of the Past: Archaeological Sites in India (2002) అన్న ఒక పిల్లల పుస్తకం; The Discovery of Ancient India: Early Archaeologists and the Beginnings of Archaelogy (2004); Delhi: Ancient History (edited, 2006). ప్రొఫెసర్ సింగ్ ఢిల్లీలో నివసిస్తూ, అధ్యాపక వృత్తి నిర్వహిస్తున్నారు. ఆమె వివాహిత, ఇద్దరు కుమారులున్నారు.