1946లో గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన ఈయన వృత్తి రీత్యా తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురంలో స్థిరపడ్డారు. వుండవల్లి సత్యనారాయణమూర్తి కళాశాలలో మూడున్నర దశాబ్దాలకు పైగా చరిత్ర బోధించి, ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు. ఆంధప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ ఆవిర్భావం నుండీ సంస్థ పురోగతికి సేవలు అందించారు. తెలుగు అకాడమికి ‘చరిత్ర రచనాశాస్త్రం’, ‘ఆంధ్రుల చరిత్ర’ (రెండు భాగాలు), ‘భారత దేశ చరిత్ర’ మొదలైన పాఠ్య గ్రంథాలతోబాటు పలు విశ్వవిద్యాలయాలకు అధ్యయన పాఠ్యాంశాలను అందించడమేగాకHistory of the Andhras’ (upto 1565 A.D.) గ్రంథాన్ని, మరెన్నో వ్యాసాలను వ్రాశారు.
--