డా. పోరంకి దక్షిణామూర్తి తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో జన్మించారు. వివిధ ఉద్యోగాలు చేశారు. తెలుగు అకాడమి ఉపసంచాలకుడిగా 1993 లో పదవీ విరమణ చేశారు. ‘వెలుగూ వెన్నెలా గోదారీ’, ‘ముత్యాల పందిరి’, ‘రంగవల్లి’ అన్న నవలలను తీరాంధ్ర, తెలంగాణా, రాయలసీమ మాండలికాలలో రచించి మూడు మాండలికాలలోనూ తొలి నవలలు రచించిన కీర్తి సంపాదించారు. మరెన్నో నవలలు, కథలు, పరిశోధన వ్యాసాలు రచించారు. అనేక అనువాదాలు చేశారు. తెలుగు కథానిక- స్వరూప స్వభావాలపై ప్రామాణికమైన సిద్ధాంత వ్యాసం రచించి డాక్టరేట్ పట్టా పొందారు.
DOB | 24-12-1935 |