ఉత్సాహం ఉరకలు వేస్తున్న యువ రచయిత్రి. తెలుగు భాషకూ, జాతికీ ఏదో చేయాలన్న తాపత్రయం. అందుకే 'అచ్చంగా తెలుగు' అనే ముఖ పుస్తక తెలుగు బృందాన్ని స్థాపించి దినాదినాభివృద్ధి సాధిస్తున్నారు. నిత్యజీవితంలో సంస్కృతి, సమాజం, రాజకీయాలు వేస్తున్న వెర్రితలల్ని వ్యంగ్యంగా విమర్శించడంలో సిద్ధహస్తురాలు. వ్యంగ్యాస్త్రం సమకాలిక సమాజానికి వ్యంగ్య వ్యాఖ్యానంతో కూడిన ప్రతిబింబం.