ఈయన స్వస్థలం మెదక్‌జిల్లా పోతారెడ్డిపాలెం. తండ్రి సుప్రసిద్ధ అష్టావధాని స్వర్గీయ గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ, తల్లి స్వర్గీయ పద్మావతి. ప్రసిద్ధ సాహితీవేత్తలు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డిల మార్గదర్శకత్వంలో రచనలో ఓనమాలు దిద్దుకున్నారు. ఇప్పటికి ఎనిమిది పుస్తకాలు అచ్చయ్యాయి. అనేక పత్రికల్లో గ్రంథ సమీక్షలు వెలువడ్డాయి. పలు సంచికల్లో వ్యాసాలు, పరిశోధనా పత్రాలు ప్రచురణ పొందాయి. రమారమి యాభై జాతీయ సదస్సులు, కొన్ని అంతర్జాతీయ సదస్సుల్లోనూ పత్రసమర్పణ చేశారు. ఈ తరానికి చెందిన ఉత్తమ వక్తల్లో ఒకరుగా గుర్తింపును పొందారు. 2007 నుండి డిచ్‌పల్లి లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విమర్శనా రంగం పట్ల అభిమానం, పరిశోధన అంటే ప్రాణం.
ప్రస్తుత రచనకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం లభించింది.
DOB | 05-09-1966 |