డా. కె.వి. సుందరాచార్యులుగారు మెదక్ జిల్లా గుమ్మడిదలలో ఏప్రిల్ 4, 1937న జన్మించారు. సంస్కృతాంధ్రభాషల్లో విశిష్టమైన పాండిత్యం గడించారు. తెలుగులో ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి. పట్టాలు పొందారు. ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాలలో 1973 నుండి ఉపన్యాసకులుగా పనిచేసి పదవీ విరమణ చేసారు. అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు అన్నది వీరి ఎం.ఫిల్ సిద్ధాంతవ్యాసం. అచ్చతెలుగు కృతులు - పరిశీలనం సుందరాచార్యులుగారి పిహెచ్.డి సిద్ధాంతవ్యాసం. కిరాతార్జునీయం, కుమార సంభవం, నైషధం వంటి సంస్కృత కావ్యాలకు సరళ వ్యాఖ్యానాలు రచించారు.