సైన్సు రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, హేతువాది. జనవిజ్ఞానవేదిక విశాఖ మాజీ అధ్యక్షుడు. నార్ల మెమోరియల్, పరుచూరి రాజారాం అవార్డుల గ్రహీత. అనంతపురం జిల్లా సోమందేపల్లె మండలం తుంగోడు శివారు కొణతట్టుపల్లి లో 1.2.1961 న జన్మించారు. 1988 నుండి ఆల్ ఇండియా రేడియో లో సీనియర్ ప్రోగ్రామ్ ఎక్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు.సైన్సు,మీడియా , సాహిత్యము, పర్యావరణము లపై 21 పుస్తకాలు వ్రాశారు. వివిధ పత్రికలలో 27 శీర్షికలు పరంపరగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతము ఈవారం , ఆంధ్రభూమి , ఆంధ్రప్రదేశ్ పత్రికలలో కాలమ్స్ రాస్తున్నారు.