సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    

ఉపీందర్‌ ‌సింగ్‌

Upinder Singh


Qualification:  ఢిల్లీ విశ్వవిద్యాలయం చరిత్ర శాఖలో ఉపీందర్‌ ‌సింగ్‌ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఢిల్లీలోని సెయింట్‌ ‌స్టీఫెన్స్ ‌కాలేజీలో చరిత్రాధ్యయనం చేశారు, ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రత్యేక అధ్యయనాంశంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ., ఎం.ఫిల్‌ ‌పట్టాలు పొందారు. మాంట్రియల్‌లోని మెక్‌గిల్‌ ‌విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌.‌డి. పట్టా పొందారు.

About Author


1981 నుండి 2004 వరకు ఢిల్లీలోని సెయింట్‌ ‌స్టీఫెన్స్ ‌కళాశాలలో చరిత్ర బోధన చేశారు. ఆ తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయం చరిత్రశాఖలో అధ్యాపకులయ్యారు. ప్రాచీన, తొలిమధ్యయుగ శాసనాలు, సామాజిక ఆర్థిక చరిత్ర, మతసంస్థలు - పోషణ, పురాతత్త్వచరిత్ర, ప్రాచీన కట్టడాల ఆధునిక చరిత్ర విశ్లేషణ వంటి వైవిధ్యభరితమైన విభిన్న అంశాల పరిశోధన పట్ల ప్రొఫెసర్‌ ‌సింగ్‌కు అపారమైన ఆసక్తి, నైపుణ్యం ఉన్నాయి. ఆమె సిద్ధాంత వ్యాసాలు వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆమె ఎన్నో గ్రంథాలను కూడా రచించారు. అవి: Kings, Braçhmanàas, and Temples in Orissa: An Epigraphic Study (AD 300-1147) (1994); Ancient Delhi (1999; 2nd edn., 2006); Mysteries of the Past: Archaeological Sites in India (2002) అన్న ఒక పిల్లల పుస్తకం; The Discovery of Ancient India: Early Archaeologists and the Beginnings of Archaelogy (2004); Delhi: Ancient History (edited, 2006).  ప్రొఫెసర్‌ ‌సింగ్‌ ‌ఢిల్లీలో నివసిస్తూ, అధ్యాపక వృత్తి నిర్వహిస్తున్నారు. ఆమె వివాహిత, ఇద్దరు కుమారులున్నారు.


Books By This Author


© 2014 Emescobooks.Allrights reserved
29847
5081