హరిలాల్‌ గాంధీ

Harilal Gandhi: A Life

చందులాల్‌ భాగుభాయి దలాల్‌

Chandulal Bhagubhai Dalal


M.R.P: రూ.150

Price: రూ.120


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 23
మూలం: చందులాల్‌ భాగుభాయి దలాల్‌
తెలుగు సేత: వాడ్రేవు చినవీరభద్రుడు
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

About This Book


హరిలాల్‌ గాంధీ మహాత్మాగాంధీ, కస్తూర్బా గాంధీల పెద్దకొడుకు. అతడి జీవితం గురించి మనకు తెలిసింది చాలా స్వల్పం. నిగూఢంగానూ, ఆకర్షణీయంగానూ ఉండే ఆ వ్యక్తిత్వం ఈ మధ్యకాలంలో ఎన్నో ఊహాగానాలకు కేంద్రబిందువయింది. ఈ పరిస్థితుల్లో హరిలాల్‌ గాంధీ జీవితంపైన చందులాల్‌ భాగుభాయి దలాల్‌ రాసిన ఈ జీవితకథ ఒక్కటే మనకు లభ్యంగా ఉన్న పూర్తిస్థాయి జీవితచిత్రణ. గాంధేయవాఙ్మయంలో ఒక మైలురాయిగా చెప్పదగ్గ రచన. చుట్టూ అల్లుకున్న అనేక అపోహలనుంచీ, ఊహాగానాలనుంచీ, నీడలనుంచీ తప్పించి ఒక జీవితవాస్తవాన్ని ఉన్నదున్నట్టుగా ప్రతిపాదించడానికి పూనుకున్న ప్రయత్నం.
గుజరాతీలో రాసిన ఈ రచనను త్రిదీప్‌ సుహృద్‌ ఇంగ్లీషులోకి అనువదించడం కేవలం అనువాదానికే పరిమితమైన విషయం కాదు. హరిలాల్‌ గాంధీ జీవితాన్ని చందూలాల్‌ దలాల్‌ గుదిగుచ్చిన క్రమంతోపాటు, త్రిదీప్‌సుహృద్‌ కూడా ఇంతదాకా ముద్రితంకాని ఉత్తరాలనుంచీ, వివిధ రచనలనుంచీ ఎంతో సమాచారం సేకరించి మనకందించారు. త్రిదీప్‌ సుహృద్‌ సేకరించిన సమాచారం, చందూలాల్‌ రాసిన జీవితకథ - ఇవి రెండూ కలిపి ఇంతదాకా మనకు హరిలాల్‌ గాంధీ మీద లభ్యమైన అత్యంతసమగ్ర సమాచారం.
ప్రముఖ రచయిత, అనువాదకుడు, కేంద్రసాహిత్యఅకాడమీ పురస్కారగ్రహీత వాడ్రేవు చినవీరభద్రుడు ఈ రచనను ఇంగ్లీషునుంచి తెలుగులోకి అనువదించారు.
ఈ రచన ఆమూలాగ్రం చదివినవారికి ఇది కేవలం తండ్రీకొడుకుల మధ్య సంభవించిన సంఘర్షణగా మాత్రమేకాక, దాన్ని దాటి ఆ రెండు వ్యక్తిత్వాల్నీ గాఢంగా కలిపి ఉంచిన నిగూఢరహస్యంగా కూడా అర్థమవుతుంది.


Books By This Author

Book Details


Titleహరిలాల్‌ గాంధీ
Writerచందులాల్‌ భాగుభాయి దలాల్‌
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-85231-03-2
Book IdEBO013
Pages 264
Release Date11-Jan-2015

© 2014 Emescobooks.Allrights reserved
36357
4935