హైందవి

Hyndhavi

ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి

Arikepoodi(Kowdoori)Kowshyalya Deviరూ. 70


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


అష్టైశ్వర్యాలలో పుట్టి పెరిగినా కొందరికి జీవితం ముళ్లబాటే అవుతుంది…

దేవకి జీవితం అలాంటిదే. కాలుక్రింద పెట్టనక్కరలేకుండా, ఎండ కన్నెరుగకుండా, తల్లిదండ్రుల ఏకైక గారాల పట్టిగా, ఆడింది ఆటగా, పాడింది పాటగా, అసూర్యంపశ్యగా పెరిగింది దేవకి. ఐశ్వర్యం ఒక్కటే జీవితంలో శాంతిని, సుఖాన్నీ ఇవ్వగలిగితే దేవకి వంటి అదృష్టవంతులెవరూ ఉండరు.

కాని సిరి అంతా ఇవ్వదు. మనిషి మనుగడకు అత్యంత అవసరమైన మనశ్శాంతి, సుఖమూ చుట్టుప్రక్కల మనుష్యులే అందించాలి. అయినవారు కావలసినవారు రాక్షసులైతే, గయ్యాళులైతే ఎంత ఐశ్వర్యమూ ఎందుకూ కొరగాకుండా పోతుంది.

దేవకి నుదుట వ్రాసిపెట్టినభర్త, ఆమె అత్తగారు, ఆడబిడ్డలూ అంతా అలాటివాళ్లే. లేకితనమూ, సిగ్గులేనితనమూ, ఓర్వలేనితనమూ, గయ్యాళితనమూ మూర్తీభవించిన మొరటు వ్యక్తులు. వెన్నలాటి మనసున్న దేవకిని వారుపెట్టని హింస అంటూలేదు. శారీరక హింస, మానసికహింస అంతా అనుభవించింది. వివాహానికి ముందు గడచిన జీవితం ఒక కలగా, అబద్దంలా మిగిలిపోయింది. అప్పటి మంచివ్యక్తులు కలలో వ్యక్తులలాగా ఉండీలేనట్టే అయినారు.

అంతా సహించి అన్యాయానికీ, రాక్షసత్వానికీ బలికావడం పాతవేడుక. దేవకి కథ కొత్త వేడుక… పిల్లి అయినా తలుపులన్నీ మూసి హింసిస్తే ఎదురుతిరుగుతుంది.

దేవకి సహనం నశించాక ఏం చేసింది? ఎవరెవరికి ఎలా పాఠం నేర్పింది? ఎవరెవరు ఎలా భంగపడ్డారు?

రెండు దశాబ్దాలకు పైగా తన అమృతలేఖినితో ఆంధ్ర పఠితహృదయాలను రంజింపజేస్తున్న తిరుగులేని రచయిత్రి ”కౌసల్యాదేవి” అద్భుత రచన -

Books By This Author

Book Details


Titleహైందవి
Writerఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి
Categoryభాషాసాహిత్యాలు
Stock Not Available
ISBN
Book IdSPI034
Pages 224
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015