ప్రేమనగర్‌

Premanagar

ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి

Arikepoodi(Kowdoori)Kowshyalya Deviరూ. 60


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


ఆకాశంలో అనూహ్యమయిన పరిస్థితుల్లో త్రాగుబోతుగా పరిచయమయిన అతనికి సేవలుచేసి భూమికి దింపింది ఆమె. ఆపదలో దురూహ్యమయిన యిబ్బందులలో ఇరుక్కున్నప్పుడు ఆమెకు ఆపద్బాంధవుడయి రక్షణ కల్పించి యింటికి చేర్చాడు. మంచి చెడుల సమ్మేళనంగా కనిపించే ఆ వ్యక్తికి అనుకోనివిధంగా కార్యదర్శి అయింది ఆమె. కార్యదర్శి మాత్రమే కాకుండా క్రమంగా అతని జీవన మార్గదర్శి కూడా అయింది. అతని తల్లి సానుభూతిని సంపాదించుకొంది. అతని అన్న చేసిన అన్యాయం ఫలితంగా సంక్రమించిన ఆస్తిపాస్తుల్ని సంస్కరించి పాడుపడిన అతని ఎస్టేటుకి ఒకరూపం కల్పించింది. అతని జీవితాన్నే ఒక పవిత్రమయిన దేవాలయంగా మలచింది. కాని – పెళ్ళి ప్రసక్తి వచ్చేసరికి ఆమె అంతస్థు చాలలేదు. ఆత్మాభిమానంతో అతని జీవితంలోంచి ఆనందంగా శలవు తీసుకొన్న ఆమె నిశ్చయానికి ఖిన్నుడయిపోయాడు అతడు. తియ్యని ఆమె జ్ఞాపకాలకు చిహ్నంగా, ఆమె ప్రేమాభిమానాలకు ప్రతీకగా ‘ప్రేమనగర్‌’ను నిర్మించాడు. బాధల, బాధ్యతల మధ్య అతలాకుతలమయిన ఆమె ‘ప్రేమనగర్‌’ ఎలా చేరుకుంటుంది? విడిపోయిన జీవితాల పర్యవసానమేమిటి? అంతస్థు – అభిమానాల అపూర్వసంఘర్షణలతో చక్కటి చిక్కటి కథాగమనంతో సాగిన మ¬న్నత నవల ‘ప్రేమనగర్‌’

Books By This Author

Book Details


Titleప్రేమనగర్‌
Writerఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి
Categoryభాషాసాహిత్యాలు
Stock Not Available
ISBN00
Book IdSPN026
Pages 128
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015