తపోభూమి

Thapobhoomi

ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి

Arikepoodi(Kowdoori)Kowshyalya Deviరూ. 60


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


నందూ ప్రేమగా, ఆహ్లాదంగా నవ్వాడు. ”నాకు తెలుసు రాధీ నీకు నాపై ఎంత ప్రేమో! అందుకే అంత ద్వేషం కూడా ప్రదర్శించగలిగావు.” ఆ మాటలు ప్రవాహాలలా ఇంకెంతసేపైనా ప్రవహించి వుండేవే. ”డాడీ! టీచర్‌గారికి మనపై కోపం లేదా?” అని అనీ కంఠం విన్పించేసరికి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ”జ్వరం తగ్గిందామ్మా?” మంచం దగ్గరకు పరుగెత్తింది రాధిక. ఇటు గుమ్మంలోనుండి ఎవరివో చప్పట్లు వినవచ్చి గిర్రున తిరిగిచూచింది. ఎప్పుడు వచ్చారో కానీ మురళీ, రాజేశ్వరీ దరహాసవదనాలతో నిలబడివున్నారు. మురళి చప్పట్లు చరుస్తున్నాడు. ”టీచర్‌….” ఏదో చెప్పబోయిన అనీని రాజేశ్వరీ, రాధికా ఒకేసారి వారించారు. ”టీచర్‌ కాదమ్మా, అమ్మా అని పిలువు ఇక.” అనీ సంతోషం వర్ణనాతీతం. ఆ సంతోషం చూచిన నందూ నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు. ”అచ్చా బావగారూ! అయితే, మా అక్కకోసం మీరు చేసిన తపస్సు ఫలించిందన్నమాటేగా?” అన్న మురళి మాటలకు అందరూ హాయిగా నవ్వుకున్నారు.

Books By This Author

Book Details


Titleతపోభూమి
Writerఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి
Categoryభాషాసాహిత్యాలు
Stock Not Available
ISBN
Book IdSPI029
Pages 160
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015